Friday, May 17, 2024

రాజకీయాలకు వీడ్కోలు పలికిన ఎంపీ గల్లా జయదేవ్

spot_img

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న ఆయన.. తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Read Also: హైదరాబాద్‎కు తరలిస్తున్న రూ. 11 లక్షల విలువైన గంజాయి

‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేను. నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉంది. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను.. కానీ, రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. రెండేళ్ల క్రితం మా నాన్న వ్యాపారాల నుంచి రిటైర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నా’ అని గల్లా జయదేవ్‌ అన్నారు.

Latest News

More Articles