Saturday, May 18, 2024

మహిళా బిల్లుకు దూరంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు

spot_img

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం ఫలించింది. కవిత పోరాటానికి జాతీయ పార్టీల మద్ధతు కూడా లభించడంతో కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలను ఎంత హడావుడిగా ప్రారంభించారో అంతే స్పీడుగా ముగించారు.

Read Also: బీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తే కాల్చి చంపుతాం.. దంపతులకు బెదిరింపు లేఖలు

పార్లమెంట్ సమావేశాల ముగింపు పై బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఎంతో హడావుడి చేసి షెడ్యూల్ కంటే ఒక్కరోజే ముందే సమావేశాలు ముగించారన్నారు. ‘కేవలం హంగు ఆర్భాటాల కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు తప్ప చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం హడావుడిగా మహిళ రిజర్వేషన్లు పెట్టింది, అందులో కూడా అనేక లొసుగులు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుండో మహిళ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళ రిజర్వేషన్లు పెట్టారు కానీ ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదు.
దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. మణిపూర్ అల్లర్లపై సభలో చర్చిస్తారు అనుకున్నాం. కానీ అర్దాంతరంగా వాయిదా వేశారు. సభలో ఇతర అంశాలు చర్చకు రాకుండా సభను నిరవధికంగా వాయిదా వేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్పలేక సభను వాయిదా వేశారు. మోడీకి తెలంగాణ పై ఎప్పుడు ప్రేమ లేదు. గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వక పోగా అనేక మాటలు అంటున్నారు. పార్లమెంట్‎లోనే మూడు సార్లు తెలంగాణపై ప్రధాని మోడీ విషం కక్కారు. చారిత్రాత్మక మహిళ బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే ఓటింగ్ ఇష్టం లేక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఓటింగ్‎కు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి క్రెడిట్ వస్తుందని ఓర్చుకోలేక తెలంగాణ కాంగ్రెస్‎కు చెందిన ముగ్గురు ఎంపీలు హాజరుకాలేదు’ అని ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Read Also: మహిళా ఎస్సైని వెంబడించి, వేధించిన కానిస్టేబుళ్లు

Latest News

More Articles