Thursday, May 9, 2024

వనపర్తిలో కేటీఆర్ టూర్.. సింగిరెడ్డి స్ట్రిక్ట్ ఇంస్ట్రక్షన్స్

spot_img

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి వనపర్తి జిల్లా కేంద్రంలోని పురోగతిలో ఉన్న రహదారుల విస్తరణ పనులను, పాలిటెక్ని కళాశాల పునరుద్ధరణ పనులు శంకుస్థాపన,కమ్యూనిటీ భవన నిర్మాణంపనులు,పరిశీలించారు

ఈ నెల 29న రాష్ట్ర ఐటీ,మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన నేపథ్యంలో నియోజకవర్గం లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను,కాంట్రాక్టర్లను ఆదేశించారు. చేపట్టే నిర్మాణపనులలో రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమం లో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, విద్యుత్ శాఖ, ఎస్సీ నాగేంద్ర కుమార్,డీఈ నరేంద్ర కుమార్, పంచాయతీరాజ్ జిల్లా అధికారి మల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles