Tuesday, May 21, 2024

పది ఏండ్లలోనే తెలంగాణ గీత, రాతను మార్చిన నాయకుడు కేసీఆర్

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

Read also: కేటీఆర్ సీఎం అయ్యే వరకు బీఆర్ఎస్ వెంటే ఉంటా..

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ‘తప్పు చేశామని ప్రజలు చర్చించుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పది సంవత్సరాల్లోనే తెలంగాణ గీత, రాతను మార్చిన నాయకుడు కేసీఆర్. ఆయనే ఈ తెలంగాణకు దిక్కని ప్రజలు చర్చించుకుంటున్నారు. సాగు, తాగునీరుతో సహా అన్ని రకాల ప్రభుత్వ పథకాలన్నీ నాయకుడు కేసీఆర్ తీసుకొచ్చినవే. పోయిన పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజల కోసం ఎక్కడా మాట్లాడలేదు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడింది, మాట్లాడింది.. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు వారి వ్యక్తిగత అవసరాలు మాత్రమే ఉంటాయి. కానీ కేసీఆర్‎కు తెలంగాణ ప్రజల అవసరాలే ముఖ్యం. అందుకే కేసీఆర్‎ని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ మళ్లీ పుంజుకుంటుంది.. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమాయత్తం కావాలి.

Latest News

More Articles