Saturday, May 11, 2024

రాకీ నటుడు దుర్మరణం..!

spot_img

హాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ సరసన ‘రాకీ’లో అద్భుత పాత్ర నటించిన కార్ల్ వెదర్స్ మరణించాడు. 76 సంవత్సరాల వయస్సులో కార్ల్ వెదర్స్ మరణించినట్లు అమెరికన్ మీడియా ధ్రువీకరించింది. కార్ల్ వెదర్స్ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు కూడా ఓ ప్రకటనలో తెలిపారు.

1987లో కార్ల్ వెదర్స్ ‘ప్రిడేటర్’లో నటించగా సూపర్ హిట్ అయింది. ఆడమ్ శాండ్లర్ ‘హ్యాపీ గిల్మోర్’లోను చిరస్మరణీయమైన పాత్రను పోషించాడు వెదర్స్. ‘స్టార్ వార్స్’, ‘ది మాండలోరియన్’ సిరీస్ లలో నటించినందుకు అత్యుత్తమ అతిథి నటుడిగా ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుకు కార్ల్ వెదర్స్ కి ఎంపికయ్యాడు.’స్ట్రీట్ జస్టిస్’, ‘కాలనీ’, ‘ది షీల్డ్’, ‘చికాగో జస్టిస్’ మరియు ‘బ్రదర్స్’, మరియు ‘క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’, ‘డెత్ హంట్’ మరియు ‘ది కమ్‌బ్యాక్స్’ వంటి టీవీ సిరీస్ లతో కార్ల్ వెదర్స్ మంచి ఫెమస్ అయ్యాడు.

Latest News

More Articles