Saturday, May 11, 2024

మార్చి17 తరువాత ప్రళయమే.. కాంగ్రెస్ కి కేటీఆర్ డెడ్ లైన్..!

spot_img

కూకట్ పల్లి నియోజకవర్గం NKNR ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు, కార్యకర్తలు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ మాకు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఆగం చేయాలనే ఆలోచన లేదు. అభివృద్ధి చేసిన తెలంగాణను వారి చేటిలో పెట్టాము, కానీ వారు సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉంటాయి అనుకున్నాము అంటున్నారు. నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణను మీకు అప్పగించాము. అన్ని చూస్తున్నాము. సీఎంగా ఉంటూ మా నాయకుడిని తిట్టడం మంచిది కాదు, మాకు నోరు ఉన్నది. మార్చి 17 దాకా ఓపికగా ఉంటాము. హామీలు అమలు చేసే వరకు పోరాడుతాము.

కేంద్రంలో అధికారంలోకి వస్తేనే హామీలు నెరవేరుస్తామని అంటున్నారు. 29 వేల లీటర్ల వరకు మంచినీటిని ఉచితంగా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఇప్పుడు మంచి నీటికి చార్జీలు వసూలు చేస్తున్నారు. మనకోసం తెగించి కొట్లాడే ఎంపి లు ఉండాలి. డూ డూ బసవన్నలు కాదు. మల్కాజ్ గిరి పార్లమెంట్ లో అన్ని నియోజక వర్గాలను గెలుచుకున్నాము. మీకోసం అందరం వస్తాము. ప్రజల తీర్పే శిరోధార్యం. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. రైతులు రైతు బందు కోసం ఫోన్ ల వైపు చూస్తున్నారు. ఫ్రీ బస్ తో మహిళలు కొట్లాడుకుంటున్నరు. పథకం మంచిదే..కానీ బస్ లను పెంచాలి. ఆటో కార్మికులను ఆదుకోవాలి, 16వ ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వారికి సాయం అందించండి. ప్రజల తరుపున పోరాడడానికి బిఆర్ఎస్ ఎప్పుడు ముందు ఉంటుంది. ప్రజా పాలనలో అప్లై చేసుకున్న వారికి లబ్ది చేకూరే వరకు పోరాడుతాము.

Latest News

More Articles