Friday, May 17, 2024

కేటీఆర్ సీఎం అయ్యే వరకు బీఆర్ఎస్ వెంటే ఉంటా..

spot_img

కార్యకర్తలు లేనిది పార్టీ లేదని.. నా కార్యకర్తలు పని చేశారు కాబట్టే నేను ఎమ్మెల్యేగా గెలిచానని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: రేవంత్ రెడ్డి.. నీ అయ్య దిగివచ్చినా రాహుల్ ప్రధాని కాలేడు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ‘కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదంతో 70 వేల మెజారిటీ వచ్చింది. కార్యకర్తలు లేనిది పార్టీ లేదు. 45 రోజులు పాదయాత్ర చేశాను. నా కార్యకర్త పని చేశారు కాబట్టే ఎన్నికల రోజున నేను ఇంటి వద్దనే ఉన్నాను. 418 పోలింగ్ బూతులలో అన్నింటిలో మెజారిటీ సాధించాం. రూ. 166 కోట్ల అనుమతి ఇచ్చిన పనులు ఉన్నాయి, అవి పూర్తి చేయండి అంటే చేయడం లేదు. కార్యకర్తలకు అండగా ఉంటాం. లబ్దిదారులు అందరికీ డబుల్ బెడ్ రూంలు వచ్చే వరకు పోరాడుతాం. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తీర్చే వరకు పోరాడుతాం. మాజీ మంత్రి వస్తే కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో ఇతర పార్టీలు మీటింగ్ పెట్టుకుంటే నేను పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించాను. మా కార్యకర్తలు పిడికిలి బిగిస్తే మీరు ఎటు పోతారు. పార్టీపరంగా అన్యాయం జరిగింది. పార్టీలో పోస్టులు రాలేదు.. దానిపై దృష్టి పెట్టాలి. ప్రాణం ఉన్నంత వరకు, కేటీఆర్ సీఎం అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటాను. కేటీఆర్‎కి అందరం అండగా ఉందాం. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే. పార్లమెంట్ ఎన్నికల్లో కూకట్ పల్లి నుండి అత్యధిక మెజారిటీ ఇవ్వాలి’ అని కృష్ణారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Latest News

More Articles