Thursday, May 2, 2024

పట్నం పట్టం కడితే.. గ్రామాలు మోసపోయాయి.. ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

spot_img

మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఉదంతాన్ని కేటీఆర్ నేడు ప్రస్తావించారు. కూకట్ పల్లి నియోజకవర్గం NKNR ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు, కార్యకర్తలు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు తెలివిగా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు ఇవ్వకుండా గులాబీ జెండాకు ఇచ్చారు.

దురదృష్టవశాత్తు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ మాయ మాటలకు ఓట్లు వేశారు. కొంచెం తేడాతో ప్రతి పక్షంలో ఉన్నాము. ప్రభుత్వంలో ఉంటే విలువ తెలువదు. ఇది కూడా మంచిదే. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తది. నగరంలో ఎప్పుడు కరెంట్ పోలేదు. ఇప్పుడు కరెంట్ పోతే పిల్లలు కాంగ్రెస్ .. కాంగ్రెస్ అంటున్నారు. పిసిసి అధ్యక్షుడు గా రేవంత్ ఏమి చెప్పాడు. రెండు లక్షలు లోన్ తెచ్చుకోండి మాఫీ చేస్తాం అన్నారు. డిసెంబర్ 9న సంతకం పెట్టి మాఫీ చేస్తాం అన్నారు. రైతులు దానికోసం ఎదురు చూస్తున్నారు. మహిళా సోదరీమణులు ఎదురు చూస్తున్నారు మహాలక్ష్మి ఎప్పుడు అని. గ్యారెంటీ కార్డులు ఎక్కడా.. 2500 ఎప్పుడు వస్తాయి అని మహిళలు చూస్తున్నారు. 100 రోజుల్లో మీరు నెరవేరుస్తామని అన్న హామీలను నెరవేర్చండి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Latest News

More Articles