Friday, May 17, 2024

రేవంత్ రెడ్డి.. నీ అయ్య దిగివచ్చినా రాహుల్ ప్రధాని కాలేడు..

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

Read Also: టిఫిన్ పెట్టలేదని తల్లిని కొట్టి చంపిన మైనర్ బాలుడు

ఈ సందర్భంగా ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోయామని గ్రామాల్లో చర్చ మొదలైందన్నారు. ‘నేను ఐదేళ్లు ఎంపీగా ఉన్నాను.. అందులో రెండేళ్లు కరోనా వల్ల ఎలాంటి నిధులు రాలేదు. కేవలం కేసీఆర్ దయతోనే అభివృద్ధి జరిగింది.‌ నేను ఎంపీగా ఉన్నప్పుడే నా పరిధిలో నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చినందుకు గర్వపడుతున్నా. గిరిజనులు, లంబాడీల పోడు సమస్య తీర్చిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మార్పు కావాలన్న దొంగ మాటలను ప్రజలు నమ్మి మోసపోయారు. కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోయామని గ్రామాల్లో చర్చ మొదలైంది. కరోనా కష్టం ఉన్నా రైతులకు రైతుబంధు ఇచ్చినటువంటి ఘనత కేసిఆర్‎ది. రేవంత్ రెడ్డి హయాంలో రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు కూడా రాలేదు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అనడం ఎంత దారుణం? జీతాలు అడిగితే ఏఎన్ఎంలు, ఆశాల గురించి ఆరోగ్య మంత్రి అవమానకరంగా మాట్లాడారు.. ఇది కాంగ్రెస్ మంత్రుల తీరు. రేవంత్ రెడ్డి.. నీ అయ్య దిగివచ్చినా రాహుల్ ప్రధాని కాలేడు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అన్ని లంగా ముచ్చట్లు చెబుతుంది. సోషల్ మీడియా ప్రచారం చూసి ప్రజలు మోసపోయి ఓట్లు వేశారు. భద్రాచలానికి రైలు మార్గం కోసం కేంద్రాన్ని అనేకసార్లు నిలదీశాం. బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులకు పలు సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చాం. దక్షిణ భారతదేశ అయోధ్య.. భద్రాచలాన్ని బీజేపీ చిన్న చూపు చూస్తోంది’ అని కవిత మండిపడ్డారు.

Latest News

More Articles