Saturday, May 18, 2024

బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలతో నక్సలిజం కనుమరుగు!

spot_img

హైదరాబాద్‌: స్వరాష్ట్రంలో ఉద్యమ నేత కేసీఆర్‌ నేతృత్వంలోని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రగతి ఫలాలను చూసి అడవీలో ఉన్న అన్నలు అరణ్యవాసాన్ని వీడారు. ఆయుధాలను త్యజించి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. ఫలితంగా తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా కనుమరుగైంది. స్వరాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టణాలు మొదలుకొని మారుమూల ఆదివాసీ గ్రామాల వరకు సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంతో మావోయిస్టులు కనుమరుగైనట్టు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది.

Also Read.. కుటుంబం కోసం కూరగాయలమ్ముకుంటున్న పీహెచ్‎డీ చేసిన వ్యక్తి

తెలంగాణలోని మావోయిస్టు క్యాడరంతా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో మకాం వేయడంతో ఆ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్నట్టు స్పష్టం తెలిపింది. నిరుడు మావోయిస్టులు బాంబు దాడులు, మందుపాతరలు, ఎదురుకాల్పుల వల్ల 61 మంది తీవ్రంగా (25 మంది కానిస్టేబుళ్లు, 13 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరుగురు ఏఎస్‌ఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు, ముగ్గురు గెజిటెడ్‌ ఆఫీసర్లు, మరో ముగ్గురు ఇతర విభాగాల అధికారులు) ఉన్నారు.

Also Read.. తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై కేంద్రం వివక్ష!

తెలంగాణలో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రోడ్లు, మంచినీరు, విద్యుత్తు, టీవీ తదితర సదుపాయాలు కల్పించింది. ఆ 6 జిల్లాలకు కలిపి ఏటా రూ.50 లక్షల చొప్పున ఖర్చు చేసిన ప్రభుత్వం.. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డులను చెక్కుల రూపంలో వారికే అందజేసే ఏర్పాట్లు చేయడంతో పరిస్థితుల్లో మార్పులను తీసుకొచ్చిందని నివేదికలో పేర్కొన్నారు.

Latest News

More Articles