Sunday, May 5, 2024

న్యూ ఇయర్ ఎఫెక్ట్.. నిమిషానికి 1,244 బిర్యానీలు, గంటకు 1722 కండోమ్‌ల ఆర్డర్

spot_img

ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న నిమిషానికి 1244 బిర్యానీల ఆర్డర్ వచ్చినట్లు ప్రముఖ ఆన్‎లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తెలిపింది. ఈ ఆర్డర్ లు కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌లోనివి మాత్రమే కావడం గమనార్హం. ఈ విధంగా హైదరాబాదీలు మొత్తంగా ఆ రోజు 4.8 లక్షల బిర్యానీల ఆర్డర్‌ చేసి గత రికార్డులను తిరగరాసినట్టు పేర్కొన్నది. గతంలో కంటే 1.6 రేట్లు ఆర్డర్లను ఆందుకున్నామని, వరల్డ్‌ కప్‌- 2023 ఫైనల్‌ సందర్భంగా ఈ తరహా ఆర్డర్లు వచ్చినా… అప్పుడు వచ్చిన దాని కంటే ఇప్పుడు 1.3 లక్షల ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయని స్విగ్గీ వెల్లడించింది.

Read Also: కుటుంబం కోసం కూరగాయలమ్ముకుంటున్న పీహెచ్‎డీ చేసిన వ్యక్తి

అదేవిధంగా ఆ రోజు 22 వేల మంది అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేసినట్లు తెలిపింది. పార్టీ కోసం 4377 మంది రెడ్ బుల్ ఆర్డర్ చేశారట. ఢిల్లీలో చాలామంది చిప్స్ కోసం ఆర్డర్ పెట్టినట్లు తెలిపింది. చిప్స్ కోసం ఏకంగా ఆరోజు రూ. 16 లక్షలు ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది. కోల్ కతాలోని ఓ వ్యక్తి 35 ఆర్డర్ల ద్వారా 914 ఐటమ్స్ బుక్ చేశాడని, వాటి విలువ రూ. 48950 ఉన్నట్లు తెలిపింది. ఇక ముఖ్యంగా ఆ రోజు దేశవ్యాప్తంగా గంటకు 1,722 కండోమ్‌లు కూడా ఆర్డర్‌ వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది.

Latest News

More Articles