Friday, May 17, 2024

దక్షిణ కొరియా విపక్ష నేతపై కత్తితో దాడి

spot_img

దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత, అధ్యక్ష అభ్యర్థి లీ జే మ్యూగ్‌పై దాడి జరిగింది. మంగళవారం ఉదయం బుసాన్‌లో పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఒక్కసారిగా ఆయన మెడపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Also Read.. న్యూ ఇయర్ ఎఫెక్ట్.. నిమిషానికి 1,244 బిర్యానీలు, గంటకు 1722 కండోమ్‌ల ఆర్డర్

దాడి అనంతరం నిందితుడు పారిపోతుండగా అక్కడ ఉన్నవారు దుండగుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 20 నుంచి 30 ఇంచుల పొడవున్న కత్తితో దాడిచేసినట్లు అధికారులు తెలిపారు. దాడి తర్వాత 59 ఏండ్ల మ్యూంగ్‌ ను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. 2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ చేతిలో మ్యూంగ్‌ ఓడిపోయారు.

Latest News

More Articles