Thursday, May 2, 2024

జపాన్‌లో 155 సార్లు కంపించిన భూమి. 24కు చేరిన మృతుల సంఖ్య

spot_img

జపాన్‌ లో సోమవారం నుంచి ఇప్పటివరకు 155 సార్లు భూమి కంపించిందని జపాన్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో 6 తీవ్రత నమోదైన భూకంపాలు అత్యధికంగా ఉన్నాయని చెప్పింది. మంగళవారం తెల్లవారుజామున కూడా ఆరుసార్లు శక్తివంతమైన ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది.

Also Read.. మణిపూర్ లో మళ్లీ హింసం, ముగ్గురు మృతి..అనేక జిల్లాల్లో కర్ఫ్యూ..!!

తాజాగా సెంట్రల్‌ జపాన్‌లో సోమవారం నాటి భారీ భూకంపం వల్ల 24 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇషికావా నగరంలోనే అత్యధిక మంది మరణించినట్లు చెప్పారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసారు.

Also Read.. రికార్డు స్థాయిలో ఐటీఆర్ ఫైలింగ్…డిసెంబర్ 31 వరకు ఎంతమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారంటే..!!

సునామీ రావడంతో అలలు మీటరు ఎత్తు వరకు ఎగసిపడ్డాయని, దీంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. వాజిమా పట్టణంలో దాదాపు 30 భవనాలు కుప్పకూలాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో 32,700 మందికి పైగా నివాసితులు అంధకారంలోనే ఉండిపోయారని అధికారులు చెప్పారు.  సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Latest News

More Articles