Friday, May 17, 2024

భారీగా పెరిగిన బియ్యం ధరలు!

spot_img

హైదరాబాద్‌: గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నమొన్నటి వరకు కిలో బియ్యం రూ. 45 నుంచి రూ.50 మధ్య లభించగా ఇప్పుడా ధర రూ. 60కిపైగా పలుకుతోంది. ప్రజలు ఎక్కువగా వినియోగించే సన్న రకాలైన బీపీటీ, హెచ్‌ఎంటీ, సోనామసూరి ధరలు సగటున క్వింటాలుకు రూ.1000 నుంచి రూ. 1500 వరకు పెరిగాయి. గతేడాది క్వింటాలు రూ. 4,500 నుంచి రూ. 5 వేల మధ్య లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ. 6,200 వరకు పెరగడం సామన్యులకు ఇబ్బందిగా మారింది.

Also Read.. జపాన్‌లో 155 సార్లు కంపించిన భూమి. 24కు చేరిన మృతుల సంఖ్య

బియ్యం ధరల పెరుగుదలకు వరిసాగు తగ్గడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఈ వానకాలంలో దేశవ్యాప్తంగా వరిసాగు పెరిగినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రాష్ర్టాల్లో వరదల కారణంగా భారీగా పంటనష్టం సంభవించింది. ఇది అంతిమంగా బియ్యం ధరపై ప్రభావం చూపిస్తున్నదని వ్యాపారులు చెబుతున్నారు. వానకాలంలో మొత్తం సాగులో 50 శాతం సన్నాలు ఉంటుండగా, ఈసారి మాత్రం 30 శాతానికే పరిమితమైందట. ప్రస్తుతం హైదరాబాద్ లో సాధారణ రకం బియ్యం 25 కిలోల బస్తా రూ. 1,650-1,800 మధ్య పలుకుతున్నది.

Latest News

More Articles