Saturday, May 11, 2024

ఏం బతుకులురా మీవి.. తేదీ మార్చకుండా సర్వే పోస్ట్ చేసి.. అడ్డంగా ఇరుక్కుంది కాంగ్రెస్

spot_img

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కాంగ్రెస్‌, బీజేపీ బరితెగిస్తున్నాయి. ప్రజల్ని గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా మైండ్‌గేమ్‌ మొదలుపెట్టాయి. సర్వే ఫలితాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ తాజాగా తేదీలతో అడ్డంగా దొరికిపోయింది.

తెలంగాణ కాంగ్రెస్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్టుచేసిన ఈ సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని పేర్కొంది. సరిగ్గా ఇక్కడే ఆ పార్టీ దొరికిపోయింది. దానిపై తేదీని మార్చడం మర్చిపోయింది. 10 నవంబర్‌ 2018న సర్వే విడుదలైనట్టు ఆ నివేదికపై ఉంది.

ఇక సీ-ఓటర్‌ సర్వే పేరుతో సోషల్‌ మీడియాలో తిరుగుతున్న సర్వే కూడా పచ్చి అబద్దమని ప్రజలు అంటున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 58 సీట్లు, కాంగ్రెస్‌కు 45 సీట్లు వస్తాయని పేర్కొంది సీ-ఓటర్‌ సంస్థ. ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చేతిలో కాంగ్రెస్‌ చావుదెబ్బ తిన్నది.

అప్పుడు బీఆర్‌ఎస్‌ ఏకంగా 88 సీట్లతో అఖండ విజయం అందుకోగా, కాంగ్రెస్‌ 19 సీట్లతో సరిపెట్టుకున్నది. ఈ లెక్కన చూసుకుంటే ఈసారి కూడా బీఆర్‌ఎస్‌దే విజయమని తేలిపోయింది. ఇక      ‘ప్రతిపక్షాలు బరితెగించి ఇలా పాత సర్వేలతో పచ్చి మోసాలు చేస్తున్నారు.. ఏం బతుకులురా మీవి అంటూ నెటిజన్స్ కాంగ్రెస్ ని తిట్టిపోస్తున్నారు.

Latest News

More Articles