Sunday, April 28, 2024

ఎన్నటికైనా న్యాయమే గెలుస్తుంది.. శ్రీనివాస్ గౌడ్ ఎమోషనల్

spot_img

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సందడి నెలకొంది. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మంత్రి ఇంటికి చేరుకుని బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. మంత్రికి అభినందనలు తెలియచేసేందుకు వచ్చిన వారితో ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. తన నివాసం వద్ద ఆయన మీడియాతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని తాజాగా కోర్టు తీర్పు ద్వారా వెల్లడైందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమోషనల్ అయ్యారు.

మహబూబ్ నగర్ జిల్లాను పరిపాలించిన ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు వారి అస్తిత్వం కనుమరుగవుతుందని కుట్ర చేసి బీసీల ద్వారానే బీసీ మంత్రి నైనా నాపై కేసు వేయించారని అన్నారు. తన ఆస్తులపై తప్పుడు ఆరోపణలు చేసి తనని ఇబ్బంది పెట్టాలని చూసిన వారికి ఇది చెంపపెట్టులాంటి తీర్పు అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల హృదయాలను గెలిచి ఓట్లు సాధించి విజయం కైవసం చేసుకోవాలి. కానీ ఇలా అక్రమంగా కోర్టు కేసుల ద్వారా తప్పుడు మార్గంలో గెలుపు కోసం ప్రయత్నించడం దుర్మార్గం. కనీసం తాగు, సాగు నీళ్లు ఇవ్వని వారిని ప్రజలు చీదరించుకున్నారు. కేసిఆర్ పాలనలో అన్ని సమస్యలు తీరాయి. మహబూబ్ నగర్ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారు. ఒకప్పుడు వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఓర్వలేక ఆ ఇద్దరు ప్రధాన పార్టీలో ప్రతిపక్ష నేతలు కుట్రతో కేసు వేయించారు అని విమర్శించారు.

 

Latest News

More Articles