Sunday, April 28, 2024

బీఆర్ఎస్ హ్యాట్రిక్.. వైరల్ గా త్రీ ప్లస్ త్రీ లాజిక్..!

spot_img

తెలంగాణలో హ్యాట్రిక్ కొడతామంటూ నేతలను మించిన నమ్మకంతో ఉంది బీఆర్ఎస్ క్యాడర్. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ బ్రాండ్. రెండవది పదేళ్ల ప్రగతి, మూడవది ప్రతిపక్షాలపై విరక్తి. ఈ మూడు కారణాలే తమని గెలిపించనున్నాయని మొన్న కేటీఆర్ చెప్పిన లాజిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

హనుమకొండ జిల్లా పరకాల సభలో ఓ ఆసక్తికరమైన లాజిక్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఏ పని చేసినా.. దాని వెనుక ఓ సెంటిమెంట్‌ పాటిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అది లక్కీ నెంబర్ కావచ్చు.. లక్కీ ప్లేస్ కావచ్చు.. ఇలా ఆయనకంటూ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ క్రమంలో.. ఇప్పుడు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా కేసీఆర్ లక్కీ నెంబర్‌ సెంటిమెంట్‌కు సరిగ్గా సరిపోయిందని కేటీఆర్ వివరించారు.

ఇప్పుడు అదే లాజిక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. త్రీ ప్లస్ త్రీ లాజిక్.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ అంటూ పెద్ద ఎత్తున మీమ్స్, రీల్స్ చేస్తూ నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. పోలింగ్ తేదీ 30లో రెండు అంకెలు కూడితే (3+0) వచ్చే సంఖ్య 3 కాగా.. కౌటింగ్ తేదీ 3.. ఈ రెండిటింనీ కూడితే (3+3) వచ్చేది 6.. కాగా కేసీఆర్ లక్కీ నెంబర్ కూడా 6 కావటంతో.. లెక్క కుదిరిందని. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం.. తెలంగాణలో మూడో సారి కూడా బీఆర్ఎస్ అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టటం ఖాయమంటూ కేటీఆర్ చెప్పిన ఆసక్తికర లాజిక్ యువతను తెగ ఆకట్టుకుంటుంది.

Latest News

More Articles