Friday, May 3, 2024

దేశంలో మళ్లీ పెరిగిన కొత్త కరోనా కేసులు

spot_img

దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ కరోనా కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. నిన్న(శనివారం) ఉదయం నుంచి ఇవాళ(ఆదివారం) ఉదయం వరకు 24 గంటల 166 మంది కొత్తగా కొవిడ్‌ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 895కు చేరింది.

ఇటీవలి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100 గా ఉంది. ఇప్పుడు శీతాకాలం కావడంతో ఇన్‌ప్లూయెంజా లాంటి వైరస్‌ల కారణంగా కేసుల సంఖ్యలో పెంపు కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు జూలైలో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. 2023 జూలై 24న కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను పరామర్శించిన సీఎం  రేవంత్ రెడ్డి

Latest News

More Articles