Friday, May 17, 2024

స్టాప్‌ క్లాక్‌: టీ20లో కొత్త నిబంధన

spot_img

టీ20 క్రికెట్‌లో మరో కొత్త నిబంధన రాబోతోంది. స్లో ఓవర్‌ రేట్‌ను అరికట్టి గేమ్‌ను మరింత జనరంజకంగా మార్చేందుకు ఐసీసీ డిసెంబర్‌ 12 నుంచి ‘స్టాప్‌ క్లాక్‌’ నిబంధనను అమలు చేయనుంది. కొత్త రూల్ ప్రకారం.. ఒక ఓవర్‌ ముగిసిన తర్వాత ఓవర్‌కు బౌలింగ్‌ టీమ్‌ కెప్టెన్‌ 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోవద్దు. మంగళవారం నుంచి ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మధ్య బార్బడోస్‌ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20 మ్యాచ్‌ ఇందుకు వేదిక కానుంది.

Also Read.. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి వస్తారు..చంద్రబాబు

నిబంధనను ఉల్లంఘించిన పక్షంలో రెండుసార్లు వార్నింగ్‌ ఇస్తారు. మూడోసారి మాత్రం పెనాల్టీ రూపంలో బ్యాటింగ్‌ టీమ్‌కు ఐదు పరుగులు ఇస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకూ నిర్వహించే 59 మ్యాచ్‌లలో ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. ఏప్రిల్‌ తర్వాత ఈ నిబంధన అమలుతీరుపై సమీక్ష నిర్వహించి, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది ఐసీసీ.

Latest News

More Articles