Friday, May 3, 2024

కేసీఆర్ ఆరోగ్యాంగా, హుషారుగా వున్నారు.. చిరంజీవి

spot_img

హైదరాబాద్: కేసీఆర్ ఆరోగ్యాంగా, హుషారుగా వున్నారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సోమవారం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన 6 వారాల్లో కోలుకుంటారని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.

Also Read.. కేసీఆర్ కోలుకొని మళ్ళీ ప్రజా సేవకు రావాలి..చంద్రబాబు

సర్జరీ తరువాత 24 గంటల్లోనే ఆయనను వైద్యులు నడిపించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని కొరుకుంటున్నాను. సినిమాలు ఎలా అడుతున్నాయి, ఇండస్ట్రీ ఎలా ఉంది అని కేసీఆర్ ఈ సమయంలో కూడా అడిగారని తెలిపారు. ఆసుపత్రిలోనే ఉన్న కేటీఆర్ భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. ఎదురుగా కనిపించిన కవితకు నమస్కరించారు. కేటీఆర్ ఆయనను లోనికి తీసుకువెళ్లారు.

chiranjivi-and-ktr

Latest News

More Articles