Friday, May 17, 2024

హిండ‌న్ ఎయిర్‌బేస్ లోకి చొరబాటు.. కలకలం రేపుతున్న సొరంగం!

spot_img

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్ వ‌ద్ద ఉన్న హిండ‌న్ ఎయిర్ బేస్ వ‌ద్ద అగంతకులు తవ్విన సొరంగం క‌ల‌క‌లం సృష్టించింది. 20 అడుగుల ఎత్తులో ఉన్న ఎయిర్‌బేస్ ప్ర‌హ‌రీ గోడ‌కు అంచున 4 అడుగుల లోతు గుంత తీయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు అందించిన స‌మాచారంతో ఈ గుంత విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌ఫోర్స్ అధికారుల‌తో క‌లిసి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న ప్రపంచకప్‌ ఫైనల్ హీరో

ఈ ఎయిర్ బేస్‌కు దేశ రాజధాని ఢిల్లీకి కేవ‌లం ప‌ది కిలోమీట‌ర్ల దూరంలోనే ఉంటుంది.  ఎయిర్‌బేస్ ప్ర‌హారీ వ‌ద్ద త‌వ్విన గుంత‌ను పోలీసులు మ‌ట్టితో పూడ్చేశారు. అయితే ఎయిర్‌బేస్‌లోకి చొర‌బ‌డేందుకు అగంత‌కులు గుంత‌ను తవ్వి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు నాలుగు అడుగుల లోతులో త‌వ్విన గుంత ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Also Read.. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి వస్తారు.. చంద్రబాబు

దేశ రక్షణకు ఎంతో కీలకమైన హిండ‌న్ ఎయిర్‌బేస్‌ ను భార‌త వైమానికి ద‌ళానికి చెందిన వెస్ట్ర‌న్ ఎయిర్ క‌మాండ్ పర్యవేక్షిస్తుంది. ఢిల్లీ గ‌గ‌న‌త‌లాన్ని సంర‌క్షించేందుకు ఇక్క‌డ మిగ్-29 యుద్ధ విమానాల‌ను మోహ‌రించారు. ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్‌బేస్‌ల‌లో ఇది ఒక‌టిగా గుర్తింపు ఉంది. ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల గ‌గ‌న‌త‌లాల‌ను సంర‌క్షించేందుకు ఇది చాలా కీల‌కం.

Latest News

More Articles