Saturday, May 11, 2024

దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఎ సోదాలు

spot_img

దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఎ 17 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లోనీ ఖైదీలకు లష్కరే ఉగ్రవాది నజీర్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేస్తున్నారు. ట్రైయినింగ్ తీసుకున్న ఖైదీల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు చేసింది. కర్నాటక, తమిళనాడుతో సహా మరో ఐదు రాష్ట్రాలలో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. 2023 జులైలో ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఈ ఐదుగురు లష్కరే తోయిబ ఉగ్రవాది నజీర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టు తేలింది. వారి దగ్గర నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, గ్రనేడ్లు, వాకీటాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు పోలీసులు ఈ కేసును ఎన్‌ఐఎకు అప్పగించారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో నజీర్ జీవితఖైదు అనుభవిస్తున్నాడు. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ సహా ఎవరు వచ్చినా ఖమ్మంలో ఎదుర్కొంటా

 

 

Latest News

More Articles