Sunday, May 12, 2024

నేడు బీహార్ సీఎం రాజీనామా? రేపు కొత్త సర్కార్ ఏర్పాటు..?

spot_img

బీహార్ ముఖ్యమంత్రి పదవికి నేడు నితీశ్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఆర్జేడీ, జేడియూ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ముగుస్తుంది. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి…కొత్త సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే నేడు శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అందులో తమ నేతగా నితీశ్ కుమార్ ను ఎన్నుకోవడం, తర్వాత ప్రభుత్వ ఏర్పటుకు ఆహ్వానించాల్సిందిగా..గవర్నర్ ను కోరడం ఇవన్నీ జరుగునున్నాయని తెలుస్తోంది. ఆదివారం నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ఉపముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బిస్కెట్ తిన్నంత సులభం జరిగిపోయేలా కనిపిస్తోంది.

ఇండియా కూటమి నుంచి తప్పుకున్న జేడీయూ..బీజేపీతో కలిసేందుకు ఉవ్వీళూరుతుంది. కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉండటమే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కీలకమైన త్రుణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఇండియా కూటమి నుంచి వైదొలగడం వల్ల ఆ కూటమి చాలా బలహీనంగా కనిపిస్తుంది. దీంతో తిరిగి అధికారంలోకి రాగలమనే ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. కనీసం ఆ కూటమి బలంగా పోటీ అయినా ఇస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి : హాస్టల్ బాత్రూంలో ఇద్దరు అగంతకులు..సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్‌లో కలకలం..!!

Latest News

More Articles