Friday, May 17, 2024

ఏకలవ్య స్కూళ్లలో 4,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్

spot_img

దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో (EMRS) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 4,062 టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు జులై 31వరకు https://emrs.tribal.gov.in/  వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 4,062 కాగా.. వీటిలో ప్రిన్సిప‌ల్‌-303, పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ)-2266, అకౌంటెంట్‌-361, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జేఎస్‌ఏ)- 759, ల్యాబ్‌ అటెండెంట్‌-373 ఉన్నాయి.

అర్హతలు: ప్రిన్సిపల్‌ పోస్టులకు బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కనీసం 12 ఏళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించరాదు. నెలకు సాలరీ రూ.78800-రూ.209200

పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారు బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 40 ఏళ్లు మించరాదు. నెలకు రూ.47600-రూ.151100 సాలరీ.

అకౌంటెంట్‌ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉండాలి. వయసు 30 ఏళ్లు మించొద్దు. నెలకు రూ.35400-రూ.112400 చెల్లిస్తారు. జేఎస్‌ఏ ఉద్యోగాలకు సీనియర్‌ సెకండరీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు 30 ఏళ్లు మించరాదు. రూ.19900-రూ.63200 చెల్లిస్తారు. ల్యాబ్‌ అటెండెంట్‌ ఉద్యోగాలకు 10/12వ తరగతి పాసైతే చాలు. వేతనం రూ.18000-రూ.56,900.

పరీక్షా విధానం: ఓఎంఆర్‌ బేస్డ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపల్‌ – రూ.2000, పీజీటీ- రూ.1500, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌- రూ.1000 చొప్పున నిర్ణయించారు అధికారులు.

Latest News

More Articles