Tuesday, May 21, 2024

ఘోరప్రమాదం..వంతెనపై నుంచి పడిన బస్సు..ఐదుగురు మృతి.!

spot_img

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వెళ్తున్న బస్సు సోమవారం సాయంత్రం ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఫ్లైఓవర్ నుండి పడిపోయింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా కనీసం ఐదుగురు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 50 మంది ప్రయాణికులతో బస్సు పూరీ నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా జాతీయ రహదారి-16లోని బారాబతి వంతెన వద్ద రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. కాగా, జాజ్‌పూర్‌ జిల్లాలో ఓ ఫ్లైఓవర్‌ పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ ప్రమాదంలో నలుగురు పురుషులు, ఒక మహిళ మృతి చెందినట్లు ధర్మశాల పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ తపన్ కుమార్ నాయక్ తెలిపారు. సుమారు 40 మంది గాయపడగా, వారిలో 30 మందిని కటక్ ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. పూరీ నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సు సోమవారం సాయంత్రం బారాబతి వంతెనపై నుంచి పడిపోయిందని ఆయన చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తం చేశారు . మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారి గురించి ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇది కూడా చదవండి: తెలంగాణవాసులకు అలర్ట్..నేడు, రేపు పెరగనున్న ఎండలు..!

Latest News

More Articles