Friday, May 17, 2024

తిరుమలలో చిక్కిన మరో చిరుత..

spot_img

తిరుమలలో వరుసగా చిరుతలు చిక్కుతూ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా తిరుమలలో బోనుకు మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. నడక మార్గంలోని లక్షితపై దాడి చేసిన ప్రదేశానికి అతి సమీపంలో 2,850 మెట్టు వద్ద టీటీడీ, అటవీ శాఖా అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

వారం రోజులుగా ఈ చిరుత కెమెరాలో చూస్తున్న అధికారులు ఈ రోజు ఉదయం బోనులో చిరుతను గుర్తించిన అటవీ శాఖ అధికారులు చిరుతను తిరుపతిలోని జూపార్క్‏కు తరలించారు. కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 6 చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించి జూపార్క్‎కు తరలించారు. అయితే వీటిలో రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడం గమనార్హం.

Read Also: టీ20లో అత్యంత చెత్త రికార్డ్.. 15 పరుగులకే ఆలౌట్

హైకోర్టులో నవదీప్‌కు షాక్‌.. నోటీసులు

నేటి నుంచి గణేష్ నిమజ్జనాలు.. జీహెచ్ఎంసీలో 74 ప్రత్యేక కొలనులు

Latest News

More Articles