Friday, May 17, 2024

నేటి నుంచి గణేష్ నిమజ్జనాలు.. జీహెచ్ఎంసీలో 74 ప్రత్యేక కొలనులు

spot_img

రాష్ట్రవ్యాప్తంగా లంబోదరుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు విభిన్నంగా విగ్రహాలను ఏర్పాటుచేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు. కాగా.. వినాయక చవితి మొదలై మూడు రోజులు కావడంతో.. నేటి నుంచి విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరుతున్నాయి.

Read Also: హైదరాబాద్ చాలా బ్యూటిఫుల్ నగరం.. మా దగ్గర టాలెంట్‎కు కొరత లేదు

హైదరాబాద్ మహానగరంలో ఈ ఏడాది దాదాపుగా 90 వేల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి విగ్రహాల సంఖ్య 25 శాతం పెరిగింది. పుణె, ముంబై నగరాలను మించి హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాలు ఏర్పాటు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవాంతరాలు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమజ్జనాల కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 కొలనులను సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ప్రస్తుతం ఉన్న 28 బేబీ పాండ్స్‌తో పాటు అదనంగా మరో 46 ప్రాంతాల్లో తాత్కాలిక పోర్టబుల్‌ వాటర్‌ ట్యాంక్‌లను ఏర్పాటు చేశారు. ఏ గణేశ్‌ను ఎక్కడ నిమజ్జనం చేయాలో, నిమజ్జనానికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను కూడా నిర్వాహకులకు ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారు.

Read Also: కాంగ్రెస్‎కు పొరపాటున ఓటేస్తే ఆ ఆరు కష్టాలు గ్యారెంటీ

Latest News

More Articles