Saturday, May 18, 2024

కొనసాగుతోన్న ఉద్యోగాల కోత.. 2,500మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ.!!

spot_img

దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాల కోత ఆగడం లేదు. ఇప్పుడు మరో దిగ్గజ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం అయిన పేపాల్ ప్రపంచవ్యాప్తంగా 9శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో దాదాపు 2500మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఈ మేరకు కంపెనీ సిబ్బందికి సీఈవో అలెక్స్ క్రిస్ లేఖ రాశారు. ఇందులో ప్రస్తుత ఉద్యోగులు, భవిష్యత్తులో నియామించుకోవాలని ప్లాన్ చేసిన పోస్టులు ఉన్నాయి. 2024లో దీనిని అమలు చేయనున్నారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ వారాంతంలో సమాచారం తెలియజేస్తామని కంపెనీ తెలిపింది.

కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్ వినియోగంతో సంక్లిష్టతలను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలో లేఖలో పేర్కొంది. ఏఐ వినియోగాన్ని పెంచుతామని గత వారం పేపాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 సెప్టెంబర్ లో క్రిస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పెద్ద ప్రకటన ఇదే. సంస్థ తర్వాత అధ్యాయనంగా దీనిని ఆయన అభివర్ణించారు. కొంతకాలంగా భారీగా పతనమైన కంపెనీ షేర్ ధరను ఆయన 20శాతం మెరుగుపరుస్తాడని ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకున్నారు. ఏఐ వినియోగంతో వేగంగా సమాచారం ప్రాసెస్ చేసే అవకాశం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే ముందే ఆశా వర్కర్ ఆత్మహత్యా యత్నం..!!

Latest News

More Articles