Sunday, May 5, 2024

నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు

spot_img

వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు ఓ సూచన చేశారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమలులో ఉంటాయని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి స్టాఫ్ న‌ర్సుల‌కు నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేయ‌నున్న నేప‌థ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షల‌ను విధించిన‌ట్లు ట్రాఫిక్ అద‌న‌పు సీపీ విశ్వ‌ప్రసాద్ తెలిపారు.

Read Also: సెక్యూరిటీ గార్డును కొట్టి చంపిన దొంగలు

స్టేడియం ప‌రిసరాల్లో మ‌ధ్యాహ్నాం నుంచి రాత్రి 7గంట‌ల వ‌ర‌కు ఆంక్షలు కొన‌సాగుతాయ‌ని, వాహ‌న‌దారులు దీనిని గ‌మ‌నించాల‌న్నారు. ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు మళ్లిస్తారు. బషీర్‎బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు వచ్చే వాహనాలను ఎస్బీహెచ్, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డుకు మళ్లించనున్నట్టు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు.

Latest News

More Articles