Sunday, May 19, 2024

జేఎన్టీయుహెచ్ పీజీ విద్యార్థుల ధర్నా

spot_img

హైదరాబాద్: కూకట్‌పల్లి జేఎన్టీయుహెచ్ లో  పీజీ విద్యార్థులు ఈ రోజు విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. హాస్టలులో తాము తినే ఆహారంలో తరచుగా పురుగులు వస్తున్నాయని, మంచి ఆహారం కొరకు తాము విజ్ఞప్తి చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్ లో నలుగురు కలిసి మాట్లాడుకున్న సెక్యూరిటీ సిబ్బంది విజిల్ ఊదుతూ తమని కనీసం నిల్చొనివ్వటం లేదని, 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారని, తమ సమస్యల పై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని అన్నారు.

Also Read.. ముగిసిన ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ టూర్

తమకు పురుగులు లేని నాణ్యమైన ఆహారం కల్పించాలని, క్యాంపస్ లో అమలవుతున్న అనధికార 144 సెక్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసిన రిజిస్ట్రార్ మంజూరు హుస్సేన్. సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పినా విద్యార్థులు తమ ఆందోళన విరమించక పోవటంతో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు. విద్యార్థులు మాత్రం తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest News

More Articles