Monday, May 20, 2024

ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు మృతి

spot_img

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు (55), హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇవాళ(శనివారం) మధ్యాహ్నం మృతి చెందారు. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో కలిసి ‘సొంత ఊరు, గంగపుత్రులు’ వంటి అవార్డు చిత్రాలతో పాటు.. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస’ వంటి సినిమాలను ఆయన నిర్మించారు.

యక్కలి రవీంద్ర బాబు మార్కాపురంలో పుట్టి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఛార్టర్డ్ ఇంజనీర్‌గా తన సేవలు అందిస్తూనే.. తనకి సినిమా పట్ల ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలను నిర్మించి పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం భాషలలో కూడా నిర్మాత యక్కలి రవీంద్ర బాబు చిత్రాలను నిర్మించారు. ఆయనకు భార్య రమాదేవి, ఒక కుమార్తె (ఆశ్రీత), కుమారుడు (సాయి ప్రభాస్) ఉన్నారు. నిర్మాతగానే కాకుండా గీత రచయితగా కూడా ఆయన తన ప్రతిభను చాటారు.

ఇది కూడా చదవండి: ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Latest News

More Articles