Tuesday, May 21, 2024

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

spot_img

తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. సీనియర్, ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించారు. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు. కొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను అభివర్ణిస్తుంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవిలకు మొదటి హీరోగా చంద్రమోహన్ నటించడం విశేషం.

Read Also: శ్రీలంకకు షాకిచ్చిన ఐసీసీ.. బోర్డు సభ్యత్వం రద్దు

చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఈయన బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశాడు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.

Read Also: జీమెయిల్‌ వాడేవారికి అలర్ట్‌.. అలా చేస్తే అకౌంట్లను డిలీట్‌ చేస్తామని గూగుల్‌ వార్నింగ్‌

Latest News

More Articles