Sunday, May 19, 2024

కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా? రైతులు ఆలోచించుకోవాలి

spot_img

హైదరబాద్: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఇంకోసారి తన వైఖరిని కుండ బద్దలు కొట్టాడని, 3 గంటల కరెంట్ చాలు అన్నాడని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకన్న రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మూడు గంటలు చాలన్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో బొంద పెట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చారు కేసీఆర్. కొనుగోళ్లు కేంద్రాలను పెట్టి ప్రతి గింజను కొంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read.. గిరిజనులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్

రైతుబంధు దుబారా అంటున్న కాంగ్రెస్ ధోరణిపై రైతులు ఆలోచన చేయాలి. తెలంగాణ రైతులు గుండెమీద చెయి పెట్టుకొని ఆలోచించుకోవాలి. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చిన మోటర్లకు మీటర్లు పెట్టేది లేదన్న సీఎం.. 30 వేల కోట్ల రూపాయలను నష్టపోయిన రైతుల తరఫున నిలబడ్డాడు. రైతు వ్యతిరేక వ్యాఖ్యలను మరోసారి బాహాటంగా చెప్పిన రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.బీఆరెస్ అంటే పంట కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు. రైతు ఎప్పుడు కరెంటు పెట్టుకోవాలి అనేది రైతు ఇష్టం. 24 గంటల కరెంటు వద్దంటున్న కాంగ్రెస్ ను ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

Also Read.. కేసీఆర్ కు ముందు.. తర్వాత జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయ్యాలి

రైతులు, వ్యవసాయం, రైతు సమస్యలుపై రేవంత్ కు అవగాహన లేదని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఉదయ్ పూర్ డిక్లరేషన్ కాదని కుటుంబాలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇక వారు ప్రకటించే డిక్షరేషన్ లకు విలువు ఏముంటుందని, అవి చిత్తుకాగితాలతో సమానమని అన్నారు.  తెలంగాణలో 24 గంటల కరెంట్ బ్రహ్మండగా ఇస్తుండగా.. 5 గంటల కరెంట్ కూడా ఇవ్వని కర్ణాటక కాంగ్రెస్ నేతలు వచ్చి క్లాసులు చెప్పడం దౌర్భగ్యకరమని పేర్కొన్నారు.

 

Latest News

More Articles