Wednesday, May 8, 2024

కేసీఆర్ కు ముందు.. తర్వాత జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయ్యాలి

spot_img

మేడ్చల్ జిల్లా: కేసీఆర్ కు ముందు.. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకొని ప్రజలు ఆలోచన చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. కేసీఆర్ కు ముందు తాండల పరిస్థితి ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నదో గమనించాలన్నారు. ఆనాడు నీళ్ల కోసం బిందలతో ఎన్నో పోరాటాలు చేశామో గుర్తు చేసుకోవాలన్నారు. ఆనాడు విష జ్వరాలతో గిరిజన గుడాలు ఇబ్బందులు పడేవని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. మేడ్చల్ జిల్లాల్లోని షామీర్ పెట్ లో గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో మంత్రి సత్యవతి రాథోడ్,  ఎంపీ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్, పలువురు కార్పొరేషన్ల చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read.. కార్తీకమాసంలో శైవ క్షేత్రాలకు టీఎస్‌ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు

‘‘ఇవాళ త్రాగు నీరు కష్టాలు లేవు. మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత అన్ని తాండలను గ్రామ పంచాయతీ లు చేశారు. 4 లక్షల 50 వేల ఎకరాల పొడు భూములకు పట్టాలు ఇచ్చింది మన కేసీఆర్. పొడు భూములకు రైతు బంధు ఇచ్చింది మన ప్రభుత్వం. ప్రతి గిరిజన బిడ్డ చదువుకోవాలని గిరిజన గురుకుల పాఠశాలు ఏర్పాటు చేసింది.

బంజారాహిల్స్ లో గిరిజన ఆదివాసీ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని బంజారా, ఆదివాసీ భవనాలను కట్టించారు. విద్య ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రిజర్వేషన్లతో ఎంతో మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. గిరిజన గుడాలకు, తండాలకు 3 పేజ్ కరెంట్ ఏర్పాటు చేశారు. వచ్చేది మన ప్రభుత్వం కాబట్టి మనకు గిరిజన బంధు వస్తుంది.

Also Read.. ఢిల్లీలా కానీయొద్దు.. ముంబై వాసులను హెచ్చరించిన బాంబే హైకోర్టు

కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు రైతు బంధు దండగ అంటున్నారు. రైతు బంధు దుబారా అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్లకు గుణపాఠం చెప్పాలి. ఎన్నికల్లో గెలువగానే ప్రతి రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తాం. గ్యాస్ సిలిండర్ 400 కె ఇస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ ఒక్కవైపు ఉంటే…మాట తప్పని కేసీఆర్ ఒక్కవైపు ఉన్నారు.  అన్నం తిన్న రేవు మరవద్దు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కిట్ ఇవ్వలేదు, న్యూట్రిషన్ కిట్ ఇవ్వలేదు, కల్యాణ లక్ష్మీ ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు అలాంటప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. 24 గంటలు ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి.

టికెట్లు ఇవ్వాలి అంటే కర్ణాటక వాళ్ళు,ఓటర్లకు డబ్బులు ఇవ్వాలి అంటే కర్ణాటక కాంగ్రెస్ వాళ్లు…ప్రచారం కోసం కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వస్తున్నారు. మనకు కృష్ణా నదిలో నీళ్ల పంచాయతీ ఉన్నది మరి అలాంటప్పుడు కర్ణాటకతో ఈ కాంగ్రెస్ వాళ్లు కొట్లాడుతారా. బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచాయతీ ఇంకా ఉంది. ఐటి కంపనీ లు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎన్నో అంతర్జాతీయ కంపెనీలను కర్ణాటక రాష్ట్రముకు తరలిస్తారు.

Also Read.. జమ్ముకశ్మీర్‌లో మరోసారి SIA సోదాలు

రైతు రుణమాఫీ ఇచ్చాము. మిగత 4 వేల కోట్ల రూపాయలు కూడా ఇసి నుండి అనుమతి ఇస్తే పూర్తి రుణమాఫీ చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం రైతులకు రుణమాఫీ చేయకుండా అడ్డుకుంటున్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. వచ్చే నెల మూడు తరువాత మన రుణమాఫీ మనము చేసుకుందాం.’’ అని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

Latest News

More Articles