Saturday, May 4, 2024

ఢిల్లీలా కానీయొద్దు.. ముంబై వాసులను హెచ్చరించిన బాంబే హైకోర్టు

spot_img

ముంబై: దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగానే ముంబైలో కూడా వాయు నాణ్యత మరింత క్షీణిస్తున్నదని ముంబై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముంబై వాసులకు కీలక హెచ్చరిక చేసింది. దీపావళికి ఎడాపెడా పటాకులు కాల్చి నగర వాతావరణాన్ని ఢిల్లీలా మార్చవద్దని హెచ్చరించింది.

Also Read.. జమ్ముకశ్మీర్‌లో మరోసారి SIA సోదాలు

ముంబైలో ఎయిర్‌ పొల్యూషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. దీపావళి సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు గంటలు మాత్రమే పటాకులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 6న బాంబే హైకోర్టు విధించిన పరిమితులను గంటపాటు తగ్గించింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ జీఎస్‌ కుల్కర్ణి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

Latest News

More Articles