Wednesday, May 8, 2024

మళ్లీ గెలిపిస్తే.. మెట్రోను మహబూబ్ నగర్ వరకు తీసుకువస్తా

spot_img

మహబూబ్ నగర్ : నియోజకవర్గంలోని ప్రజలందరినీ తన కుటుంబ సభ్యుల వలె భావిస్తానని, అందుకే వారికి 24 గంటలు 365 రోజులు సేవ చేస్తూనే ఉన్నానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కుల మతాలకతీతంగా ప్రజాసేవ చేసేందుకే తాను రాజకీయాలకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సీనియర్ బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు డి చెన్నకేశవరావు, శంకర్, శరత్, డాక్టర్ అజరుద్దీన్, నరసింహ నాయక్, నరేష్, విజయ్ సహా సుమారు 100 మందికి పైగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Also Read.. ఆర్చ‌ర్ ధీర‌జ్‌ రికార్డు.. ఖాయమైన ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ… తన గెలుపు కోసం కష్టపడి పని చేస్తున్న సయ్యద్ ఇబ్రహీంకు కృతజ్ఞతలు తెలిపారు. గత పదిహేళ్లుగా జరుగుతున్నఅభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించాలని… అందుకు కార్యకర్తలు అంతా తీవ్రంగా కృషి చేయాలని మంత్రి కోరారు. యువత స్థానికంగానే ఉద్యోగాలు చేసుకోవాలని ఉద్దేశంతో ఐటీ టవర్, లిథియం గిగా ఇండస్ట్రీ, ఫుట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముంబాయి,  దుబాయ్, పుణె వంటి దూర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. షాద్నగర్ వరకు విస్తరిస్తున్న మెట్రోను మహబూబ్ నగర్ వరకు తీసుకువస్తామన్నారు.

Latest News

More Articles