Saturday, May 18, 2024

తెలంగాణ సహా 4 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కు సిద్ధం..!!

spot_img

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ షురూ కానుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు షురూ అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలోనే కౌంటింగ్ కు అన్ని ఏర్పాటు చేసింది ఈసీ. ఇక తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ 49 కౌంటింగ్ సెంటర్స్ లో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతుంది.

అయితే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుల్స్ ఉంటాయి. కూకట్ పల్లి, ఉప్పల్, మల్కాజ్ గిరి, పటాన్ చెరు ఈ 4 నియోజకవర్గాల్లో 4వందలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో 20 టేబుళ్లను రెడీ చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 5వందలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇక చిన్న నియోజకవర్గాల్లో ఉదయం 10గంటల కల్లా మొదటి ఫలితం వెలువడే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి: నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్…!!

Latest News

More Articles