Saturday, May 4, 2024

ఏపీలో దంచికొడుతున్న వర్షం…విద్యాసంస్థలకు సెలవు..!!

spot_img

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది.

మైచౌంగ్ తుఫాన్ ఈ నెల 4న నెల్లూరు మచిలీపట్నం తీరం దాటే ఛాన్స్ ఉండటంతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడదని..అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సహాయ పునారావస కార్యక్రమాలు చేపట్టేందుకు తుఫాన్ ప్రభావిత జిల్లా కలెక్టర్లను సిద్ధంగా ఉండాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా అటు పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది రైళ్ల శాఖ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140కిపైగా రైళ్లు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి : నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్…!!

Latest News

More Articles