Sunday, June 23, 2024

మంత్రుల ఇండ్లల్లో ఘనంగా రాఖీ సంబురాలు

spot_img

నేడు సామాన్యులతో పాటు మంత్రులు, ప్రముఖుల ఇండ్లలో రాఖీ పౌర్ణమి వేడుకలు సంబురంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి ఆయన సోదరీ మణులు రాఖీ కట్టగా, మంత్రి జగదీశ్‌ రెడ్డికి ఆయన కూతురు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు ఆయన సోదరి రాఖీ కట్టారు.

ఇక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కి బంధువులతో పాటు నియోజకవర్గంలోని సోదరీమణులు రాఖీలు కట్టగా.. ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆయన చెల్లెలు శ్రీదేవి రాఖీ కట్టారు. హైదరాబాద్, మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి ఇంటిలో రాఖీ కట్టి అన్న ఆశీర్వాదం తీసుకున్నారు.

Latest News

More Articles