Saturday, May 18, 2024

దుమ్మురేపిన రుతురాజ్.. 52 బంతుల్లో మెరుపు శ‌త‌కం

spot_img

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గువాహటి వేదికగా మూడో టీ20 మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ దుమ్మురేపింది. టీమిండియా ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 123 నాటౌట్‌, 13 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అంత‌ర్జాతీయ స్థాయిలో తొలి శ‌త‌కాన్ని న‌మోదుచేసుకున్నాడు. గ‌త రెండు మ్యాచ్‌ల‌లో రాణించిన య‌శ‌స్వీ జైస్వాల్‌, ఇషాన్ కిష‌న్‌లు విఫ‌ల‌మయ్యారు.

కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (29 బంతుల్లో 39, 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), తిల‌క్ వ‌ర్మ (24 బంతుల్లో 31 నాటౌట్‌, 4 ఫోర్లు) లు ధాటిగా ఆడ‌టంతో భార‌త్ భారీ స్కోరు నమోదు చేసింది. రుతురాజ్ శత‌కంతో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ టీ20 సిరీస్‌లో భార‌త్ 200 ప్ల‌స్ స్కోరు చేయ‌డం ఇది వ‌రుస‌గా మూడోసారి కావడం గమనార్హం. 33 బంతుల్లో అర్థ సెంచ‌రీ చేసిన అత‌డు త‌ర్వాత 19 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తిచేయ‌డం గ‌మనార్హం. ఆసీస్‌ బౌలర్లలో కేన్ రిచర్డ్ సన్‌, బెరెన్‌డార్ఫ్‌, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు.

Latest News

More Articles