Sunday, May 5, 2024

ఈ రోజు చాలా ప్రత్యేకం.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు..

spot_img

పద్నాలుగేండ్ల కిందట.. ఇదే రోజు! 2009 నవంబర్‌ 29.. ఓ బక్క మనిషి దీక్షబూనాడు. అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఆ రోజు ఆయన మనోబలం వజ్ర సదృశం. తెలంగాణ సాధించాలన్న పంతమే.. ఆయన సంకల్పానికి ఉక్కు కవచం. ‘ఇది మనకు అంతిమ యుద్ధం..’ పిడికిలెత్తి ప్రకటించాడు ఉద్యమ కేసరి కేసీఆర్‌. ‘తెలంగాణ జైత్రయాత్రనా.. కేసీఆర్‌ శవయాత్రనా’ అని గొంతుక నరాలు తెగేలా నినదించాడు. ఆ పిలుపు.. తెలంగాణ ఊరూరా ప్రతిధ్వనించింది. వాడవాడనూ కదిలించింది. ప్రతీ తెలంగాణ బిడ్డను పిడికిలి బిగించేలా చేసింది.

తెలంగాణ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకస్థానం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన నవంబర్‌ 29 అందరూ గుర్తుంచుకోవాల్సిన రోజన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజు నవంబర్‌ 29కి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌కు దకుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తేలేకపోతే రాళ్లతో కొట్టిచంపండి అని ధైర్యంగా చెప్పింది కేసీఆర్‌ అని గుర్తుచేశారు.

ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణాలు సైతం లెకచేయకుండా కేసీఆర్‌ తెగించి పోరాడి తెలంగాణ సాధించారని చెప్పారు. ఈ క్రమంలోనే నవంబర్‌ 29న ప్రతి సంవత్సరం తెలంగాణలో దీక్షా దివస్‌ను జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సంవత్సరం సైతం దీక్షా దివస్‌ను బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడుగడుగునా అడ్డుకున్నదని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు, కేసీఆర్‌ పోరాట స్ఫూర్తిని దీక్షా దివస్‌ ద్వారా వ్యాప్తిచేయాలని పిలుపునిచ్చారు.

Latest News

More Articles