Friday, May 17, 2024

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్ ఫోన్ పై అదిరే ఆఫర్.!

spot_img

ప్రపంచ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించిన శాంసంగ్..ఎప్పకప్పుడు మార్కెట్లోకి సరికొత్త మొబైల్ మోడల్స్ ను విడుదల చేస్తూ ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. తాజాగా శాంసంగ్ ఎస్ 24 మోడల్స్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కొత్త గ్యాడ్జెట్స్ వాడే యువతకు ఈ ఎస్ 24 ఉపయోగించుకునేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త మొబైల్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ సిరీస్ లో ఎస్ 24, ఎస్ 24 ప్లస్, ఎస్ 24 అల్ట్రా పేర్లతో మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్స్ తోపాటు ఆకట్టుకునే ధర ఈ ఫోన్స్ ప్రత్యేకత . ఓ సారి ఫీచర్స్ చూస్తే..శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24లో 6.2ఇంచ్ ఫుల్ హెడ్జీ ప్లస్ డిస్ప్లే 120 రిఫ్రెష్ రేట్ 2600నిట్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. 4000ఏంహెచ్ బ్యాటరీతోపాటు ఈ అల్యూమినియం మెటీరియల్ తో ఈ ఫోన్ తయారు చేశారు. ఎస్24+, ఎస్24 అల్ట్రాలో 6.7 ఇంచ్- 6.8 ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లేలు ఉన్నాయి. ఎస్24, ఎస్24+లో 50ఎంపీ ప్రైమరీ, 10ఎంపీ టెలిఫొటో, 12ఎంపీ అల్ట్రా వైడ్ ట్రిపుల్ రియర్ కెమెరాలు ఈ ఫోన్స్ లో ఉన్నాయి.

గెలాక్సీ ఎస్‌24- ఎగ్జినోస్‌ 2400 ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. అలాగే 8జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.89,999గా ఉంది. గెలాక్సీ ఎస్‌24+ – ఎగ్జినోస్‌ 2400 ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. 12GB+512GB వేరియంట్ ధర రూ.1,09,999. గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా 12GB+256GB ధర రూ.1,29,999గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ మోడల్ ఫోన్లలో ఎన్నో అద్భుతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్లలో ఏడేళ్ల ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ తో పాటు ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిపై ఏకంగా రూ.10 వేల తగ్గింపు ఉంది. ఆఫర్ కింద రూ.10 వేలు సేవ్ రూ.7 వేల ఆఫర్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 3650 తగ్గింపు ఉంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఏకంగా రూ. 58,500 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: వాహనాల రిజిస్ట్రేషన్.. టీఎస్ నుంచి టీజీకి మారుస్తూ కేంద్రం గెజిట్.!

Latest News

More Articles