Sunday, May 19, 2024

సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం..గెజిట్ జారీ చేసిన కేంద్రం.!

spot_img

సెప్టెంబర్ 17పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికషన్ మంగళవారం రాత్రి జారీ చేసింది. హైదరాబాద్ విమోచన దినోత్సవం పురస్కరించుకుని ఆ రోజు అధికారిక కార్యక్రమాలను నిర్వహించాలని హోంశాఖ గెజిట్ లో తెలిపింది.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం 13 నెలలపాటు నిజాం పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్యతోప ఈ ప్రాంతం భారత్ లో విలీనం అయ్యింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకునేందుకు, యువతలో దేశభక్తి నింపేందుకు సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందంటూ హోం మంత్రిత్వ శాఖ గెజిట్ లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ టీఎస్ నుంచి టీజీకి మారుస్తూ కేంద్రం గెజిట్.!

Latest News

More Articles