Sunday, May 5, 2024

డీఈడీ, బీఈడీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి..రేవంత్ కు హరీశ్ రావు లేఖ.!

spot_img

డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించి..డీఈడీ, బీఈడీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు హరీశ్ రావు.

టెట్ నిర్వహించకపోవడం వల్ల ప్రస్తుతం విడుదలైన డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతను చాలా మంది కోల్పోతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది సెప్టెంబర్ లో బీఆర్ఎస్ సర్కార్ టెట్ నిర్వహించిందని..కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఒకసారి కూడా టెట్ నిర్వహించలేదన్నారు. గత ఏడాది డిసెంబర్ లో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు దాదాపు 50వేల మంది ఉన్నట్లు లేఖలో వివరించారు.

కాగా టెట్ నిర్వహించినట్లయితే ఇందులో అర్హత సాధించిన వారంతా కూడా డీఎస్సీకి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని హరీశ్ తెలిపారు. డీఈడీ, నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగవకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు కోరారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ నుంచి తరలిపోతున్న కంపెనీలు..గుడ్ బై చెప్పిన కేన్స్..!

Latest News

More Articles