Sunday, May 19, 2024

రేపట్నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు.. ఫలించనున్న కవిత పోరాటం!

spot_img

న్యూఢిల్లీ : కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌లో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. సెప్టెంబర్ 20న మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Also Read.. కొత్త పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి

సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సహా పలు కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ ఎంపీలు పట్టుపట్టారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కొన్నాళ్లుగా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇదే అంశంపై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాయడం, విపక్షాలతోపాటు ఎన్డీఏలోని పార్టీలు మహిళా రిజర్వేషన్లపై పట్టుబట్టడంతో మోడీ సర్కార్ దిగొచ్చినట్లు తెలుస్తోంది.

Latest News

More Articles