Friday, May 17, 2024

శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్ప‌గించిన రేవంత్ సర్కార్

spot_img

హైదరాబాద్: అనుకున్నదే అయింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణను కేబీఆర్‌ఎంబీకు అప్ప‌గించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చాలా విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉందని విపక్షాలు మొత్తుకుంటున్నా.. ప్రాజెక్టుల నిర్వహణను ఏకపక్షంగా అప్పగించేశారు. ప్రాజెక్టుల నిర్వహణపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఇందులో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేబీఆర్‌ఎంబీకి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ ఒప్పుకున్నాయి.

Also Read.. కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదు.. రేవంత్‌పై కీలక వ్యాఖ్యలు..!!

నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్‌ఎంబీకి ఇచ్చినట్లు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ తెలిపారు. అయితే, పవర్ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం వైపు ఏపీ చూసుకుంటుందని, ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయని తెలంగాణ ఈఎన్‌సీ తెలిపారు.

Also Read.. వెళ్లడానికి బస్సులు లేవని మద్యంమత్తులో 108కు ఫోన్

Latest News

More Articles