Thursday, May 2, 2024

డ్రగ్స్ సప్లై కేసులో మహిళకు 14 ఏండ్ల జైలు శిక్ష విధించిన ఎల్బీనగర్ కోర్టు

spot_img

శంషాబాద్ ఎయిర్‎పోర్టులో డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన జాంబియన్ మహిళకు కోర్టు 14 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జూన్ 2021లో జాంబియా నుంచి హైదరాబాద్ కు 8 కిలోల హెరాయిన్ సరఫరా చేస్తూ జాంబియన్ దేశస్థురాలు పట్టుబడిది. ఆ హెరాయిన్ విలువ రూ. 52.32 కోట్లుగా కస్టమ్స్ అధికారులు తేల్చారు. నిందితురాలిని అరెస్ట్ చేసి, ఎల్బీనగర్ లోని రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి విచారించిన కోర్టు.. నేడు తుది శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. నిందితురాలికి 14 ఏండ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.

Read Also: వెళ్లడానికి బస్సులు లేవని మద్యంమత్తులో 108కు ఫోన్

Latest News

More Articles