Sunday, May 19, 2024

సన్ రైజర్స్ పై విరుచుకుపడ్డ సూర్య..ముంబై ఘన విజయం.!

spot_img

ముంబై ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి చేరుకుంది. హైదరాబాద్‌పై ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్ తుఫాను సెంచరీ సాధించాడు. అతని కారణంగానే ముంబై ఇండియన్స్ జట్టు మ్యాచ్‌ను గెలుచుకోవడంలో విజయం సాధించింది. సూర్యకు తిలక్ వర్మ బాగా మద్దతు ఇచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోరీ అండర్సన్‌ల 9 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు చాలా బ్యాడ్‌ ఆరంభం లభించింది. రోహిత్ శర్మ నాలుగు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోగా, ఇషాన్ కిషన్ 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీని తర్వాత నమన్ ధీర్ తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. అయితే ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అద్భుతంగా రాణించారు. తిలక్ వర్మ ఒక ఎండ్ పట్టుకోగా, మరో ఎండ్ నుంచి సూర్యకుమార్ యాదవ్ పేలుడు బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు నాలుగో వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై ఇండియన్స్‌కి ఐపీఎల్‌లో నాలుగో వికెట్‌కి ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. గతంలో ఈ రికార్డు రోహిత్ శర్మ, కోరీ అండర్సన్‌ల పేరిట ఉంది. ఐపీఎల్ 2015లో కేకేఆర్‌పై వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 131 పరుగులు చేశారు.

143 – తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, 2024

131 – కోరీ ఆండర్సన్,రోహిత్ శర్మ, 2015
122 – కీరన్ పొలార్డ్, అంబటి రాయుడు, 2012
119 – ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, 2020

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సూర్యకుమార్ యాదవ్ పేలుడు బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. మైదానం అంతటా స్ట్రోక్స్ కొట్టాడు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డా.. ఒక్కసారిగా క్రీజులోకి అడుగుపెట్టిన తర్వాత దూకుడుగా రాణించాడు. అతను జట్టుకు అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సాయంతో 102 పరుగులు చేశాడు. అతనితో పాటు తిలక్ వర్మ 32 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రాణించలేకపోయారు.

ఇది కూడా చదవండి: నేడు లోకసభ మూడోదశ ఎన్నికలు..!

Latest News

More Articles