Sunday, May 19, 2024

నేడు లోకసభ మూడోదశ ఎన్నికలు..!

spot_img

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు మూడో విడత పోలింగ్ షురూ అయ్యింది. 11 రాష్ట్రాల్లో 93 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ దశలో మొత్తం 1351మంది అభ్యర్థులు బరిలో దిగారు. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాకలకు పోలింగ్ జరగాల్సి ఉంది. సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. జమ్మూకశ్మీర్ రాజౌరీ, అనంత్ నాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని ఆరో విడతకు మార్చారు. మధ్యప్రదేశ్ లో రెండో విడతలో జరగాల్సిన ఒక స్థానాన్ని ఈ విడతలో నిర్వహిస్తున్నారు.

కాగా ఈ దశలో కేంద్రమంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తమ్ రూపాలా, ప్రహ్లాద్ జోషీ, ఎన్ పి సింగ్ బఘెల్ బరిలో నిలిచారు. గుజరాత్, కర్నాటక, బీహార్, మధ్యప్రదేశ్ లో మంగళవారం పోలింగ్ జరగనున్న అన్ని స్థానాలకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయే అధికారాన్ని దక్కించుకుంది. వాటిని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.

ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న కేసీఆర్ పాలనపై ఎమోషనల్ సాంగ్.!’

Latest News

More Articles