Saturday, May 18, 2024

పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి

spot_img

పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో జరిగింది. కోయంబత్తూరు జిల్లా పెరియనాయకన్ పాళయం నుంచి దిండిగల్ జిల్లా పళనికి వివాహ వేడుక నిమిత్తం కారు వెళ్తుండగా, కోయంబత్తూరు జిల్లాలోని ఇరుగూర్ నుంచి మనకడౌ‎కు ట్యాంకర్ పెట్రోలు తీసుకెళ్తోంది.

Read Also: పొలిటికల్ టూరిస్ట్ రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ పోస్టర్లు

అయితే జిల్లాలోని మనకడౌలోని ధారాపురం వద్ద రాగానే కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పెట్రోల్‌ ట్యాంకర్‌‎ను ఢీకొట్టింది. దీంతో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

కాగా.. రోడ్డు ప్రమాదం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించినవారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Latest News

More Articles